Heat Wave: ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం పెరగడం, వాతావారణ కాలుష్యం వెరిసి భూమి సగటు ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. దీంతో హిమనీనదాలు కరుగుతున్నాయి. కొన్నేళ్లలో అంటార్కిటికాలోని మంచు కరిగి సముద్ర నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని, దీంతో తీర ప్రాంతాల్లోని నగరాలకు ముప్పు ఉందని పరిశోధకలు హెచ్చరిస్తున్నారు.
భూమిపైనే అత్యంత వేడి రోజుగా జులై 3 రికార్డును నమోదు చేసింది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ శాఖ తెలిపింది. జులై 3వ తేదీన భూఉపరితలానికి 2 మీటర్ల ఎత్తులోని గాలి సగటు ఉష్ణోగ్రత 62.62 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా 17.01 సెల్సియస్‌కు చేరుకుందని వెల్లడించింది.