వెనిజులా సంక్షోభం మామూలుగా లేదు. గత ఏడాదంతా అంతర్జాతీయంగా యుద్ధాల కారణంగా బంగారం, వెండి ధరలు బెంబేలెత్తించాయి. కొత్త ఏడాదిలోనైనా దిగొస్తాయనుకుంటే లేటెస్ట్గా వెనిజులా సంక్షోభం ముంచుకొచ్చింది. దీంతో బంగారం, వెండి ధరలు సునామీ సృష్టిస్తున్నాయి.
సిల్వర్ ధరలు మళ్లీ విశ్వరూపం సృష్టిస్తున్నాయి. గతేడాది సునామీ సృష్టించిన ధరలు.. ఈ ఏడాది కూడా అదే జోరు కనిపిస్తోంది. తాజాగా వెనిజులా సంక్షోభంతో బంగారం, వెండి ధరలు మరింత పెరగొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
గతేడాది మెరుపులు, వెలుగులు సృష్టించిన బంగారం, వెండి ధరలు.. ఈ ఏడాది కూడా విశ్వరూపం సృష్టించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత సంవత్సరం అంతర్జాతీయంగా పలు దేశాల్లో యుద్ధాలు కారణంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. వీకెండ్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు.. ఈరోజు శాంతించాయి. దీంతో కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం లభించింది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.380 తగ్గగా.. కిలో వెండిపై రూ. 2,000 తగ్గింది.
గతేడాది మెరుపులు, విశ్వరూపం సృష్టించిన బంగారం, వెండి ధరలు.. కొత్త ఏడాదిలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నాయి. నూతన సంవత్సరంలోనూ మగువలకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
గతేడాది బంగారం, సిల్వర్ ధరలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఎన్నడూ లేనంతగా ధరలు ఆకాశన్నంటాయి. బంగారం మెరుపులు సృష్టిస్తే.. సిల్వర్ అయితే ఒక వెలుగు వెలిగింది. అంతగా ధరలు హడలెత్తించాయి. సామాన్యులు అయితే పసిడి కొనాలంటేనే బెంబేలెత్తిపోయారు.
దేశీయ మార్కెట్ న్యూఇయర్ వేళ మంచి జోష్‌తో ప్రారంభమైంది. గతేడాది ఒడిదుడుగులు ఎదుర్కొన్న మార్కెట్.. నూతన సంవత్సరం వేళ మాత్రం మంచి ఊపుతో మొదలైంది. ప్రస్తుతం అన్ని రకాల సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి.
పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా దడపుట్టిస్తున్న బంగారం, వెండి ధరలు ఏడాది చివరిలో శాంతించాయి. నిన్న కొంతమేర తగ్గిన ధరలు.. ఈరోజు అయితే భారీగా తగ్గాయి. దీంతో కొనుగోలుదారులకు భారీ ఉపశమనం లభించింది. తులం గోల్డ్ ధరపై రూ.3,050 తగ్గగా.. కిలో వెండిపై రూ.18,000 తగ్గింది.
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. బంగారం, సిల్వర్ ధరలు దిగొచ్చాయి. గత వారం వెండి ధరలు విశ్వరూపం సృష్టించాయి. దాదాపు 3 లక్షల చేరువకు వెళ్లిపోయింది. వారం రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.50,000 పెరిగిపోయింది. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోయారు. ఈ వారం ప్రారంభంలో మాత్రం స్వల్ప ఊరట కలిగించింది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.710 తగ్గగా.. కిలో వెండిపై రూ.4,000 తగ్గింది.
వామ్మో.. సిల్వర్‌కు ఏమైంది? మునుపెన్నడూ లేని విధంగా వెండి ధర సునామీ సృష్టిస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకు లక్ష రూపాయులు ఉండేది. ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ రెండు లక్షలకు దూసుకొచ్చింది. ఇక్కడితో ఆగిపోతుందేమోనని భావించారు. కానీ మరోసారి రికార్డ్ సృష్టించేందుకు పరుగులు పెడుతోంది.