నిద్రలో కలలు రావడం ప్రతి ఒకరిలో సాధారణంగానే జరుగుతుంటుంది. అయితే మంచి కలల వల్ల ప్రశాంతంగా నిద్రపోతారు. కానీ పీడ కలలు లేదా భయానక స్వప్నాలు రావడం చెడు అనుభవాన్ని కలిగిస్తాయి. దీని వల్ల భయంతో నిద్రలో నుంచి హఠాత్తుగా మెలకువ వస్తుంది. సాధారణమైన కలల్లో వ్యక్తులు ప్రపంచాన్ని చుట్టి వస్తారు. కానీ పీడ కలల్లో మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాకుండా ఇలాంటి కలల వల్ల అనారోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది.
Ghost Dreams: అర్ధరాత్రి.. నడిరోడ్డుపై ఒక దెయ్యం.. మీ ముందుకు నడుచుకుంటూ వస్తుంది.. మీ గుండె వేగం పెరిగిపోతుంది. ఆ దెయ్యం వేగంగా వచ్చి మీ మీదకు దూకింది. అంతే భయంతో సడెన్ గా బెడ్ లేచి కూర్చున్నారు. ముఖమంతా చెమటలు.. చుట్టూ చూస్తే అంతా నార్మల్ గా ఉంది.. కొద్దిసేపటికి అర్ధమయ్యింది.. అది కల అని. ఇలాంటి కలలు తరుచుగా అందరికి వస్తూ ఉంటాయి. ఇదొక్కటే ఉదాహరణ కాదు.. ఇంతకన్నా దారుణంగా వస్తూ ఉంటాయి కొందరికి..…