Ghol fish: గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర చేపగా ‘ఘోల్ ఫిష్’ని ప్రకటించింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న రెండు రోజుల గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా-2023 సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘోల్ ఫిష్‌ని గుజరాత్ రాష్ట్ర చేపగా ప్రకటించారు.
అప్పుడప్పుడు మత్స్యకారుల వలకు అరుదైన చేపలు దొరుకుతుంటాయి. అలా దొరికిన వాటిని వేలంలో భారీ ధరలకు విక్రయిస్తుంటారు. ఇలానే, కర్ణాటకలోని ఉడిపిలో మత్స్యకారుని వలకు అరుదైన ఘోల్ ఫిష్ చిక్కింది. ఈ రకమైన చేపలకు బహిరంగ మార్కెట్‌లో భారీ ధర ఉంటుంది. పెద్ద మొత్తంలో చెల్లించి వీటిని కొనుగోలు చేస్తుంటారు. ఈరకమైన చేపల్లో ఔషదగుణాలు అధికంగా ఉంటాయి. మెడిసన్ రంగంలో వీటిని వినియోగిస్తుంటారు. Read: జరభద్రం: ఆ వైరస్ గాలిలో మూడు మీటర్లకు మించి ప్రయాణం…