హైదరాబాద్ జీహెచ్ఎంసీ (GHMC ) కార్యాలయంలో కాంట్రాక్టర్లు నిరసన చేపట్టారు. బిల్లులు చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు కమిషనర్‌ను కలిసేందుకు జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో.. సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుని గేట్లకు తాళం వేశారు. ఈ క్రమంలో.. ఓ కాంట్రాక్టర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు.
elangana Congress: భారీ వర్షాల కారణంగా వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జీహెచ్‌ఎంసీ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆందోళనకు దిగిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నగరంలోని లిబర్టీ వద్ద జీహెచ్‌ఎంసీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫర్నీచర్, పూలకుండీలు ధ్వంసం చేసినందుకు 10 మంది కార్పొరేటర్లపై కేసులు నమోదయ్యాయి. కాగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలంటూ మంగళవారం మధ్యాహ్నం జీహెచ్‌ఎంసీ ఆఫీస్ వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ ఛాంబర్‌లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని బీజేపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఎన్నికల కోడ్ ఉన్నందున…
హబ్సిగూడ జీహెచ్‌ఎంసీ వార్డ్ ఆఫీస్ ను తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు ఉప్పల్ బేతి సుభాష్ రెడ్డి. గతంలో ఎమ్మెల్యే భార్య బేతి స్వప్న హబ్సిగూడ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు అక్కడే కలిసి పనిచేసారు ఎమ్మెల్యే, కార్పోరేటర్. కానీ ప్రస్తుతం హబ్సిగూడ కార్పొరేటర్ గా బీజేపీ అభ్యర్థి చేతన ఉన్నారు. దాంతో ఉప్పల్ జీహెచ్‌ఎంసీ అధికారులు వార్డ్ ఆఫీస్ మాకు ఇవ్వాలని కోరినా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. దాంతో చెట్టు కింద విధులు నిర్వహిస్తున్నారు బీజేపీ…