Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాడిరైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. భూపాలపల్లిలో నియోజకవర్గంలో ఒక వ్యక్తి బర్రెల షేడ్‌ను కూలగొట్టారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి బర్రెలను తోలాడు. దీంతో క్యాంపు కార్యాలయంలో ఉన్న నేతలు, కార్యకర్తలు, ప్రజలు గందరగోళానికి గురయ్యారు. పోలీసుల వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే..
హైడ్రా – జీహెచ్ ఎంసీ పరస్పర సహకారంతో పని చేస్తే వర్షాకాలం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడగలమని హైడ్రా – జీహెచ్ ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్ , కర్ణన్ అభిప్రాయ పడ్డారు. సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం క్షేత్ర స్థాయిలో ఎదురౌతున్న సమస్యలు.. వాటి పరిష్కారంలో ఇబ్బందులపై ఇరువురు కమిషనర్లు గురువారం జీహెచ్ ఎంసీ కార్యాలయంలో చర్చించారు. ఇరు శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.…
హైదరాబాద్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం మంత్రి కేటీఆర్ స్వచ్ఛ వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నగరం కేసీఆర్ గారి నేతృత్వంలో ముందుకు వెళ్తుందన్నారు. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా మున్సిపాలిటీలో స్వచ్ఛ వాహనాలను ప్రారంభింస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ స్వచ్ఛతలో దేశంలోని అన్ని నగరాల కన్నా ముందు ఉందన్నారు. సీఎం కేసీఆర్…
బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికలంటే ఎప్పుడూ ఉత్కంఠే. తాజాగా బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్లు రసవత్తరంగా మారాయి. మరికొద్ది గంటల్లో ముగియనున్న నామినేషన్ల గడువు ముగియనుంది. చివరిరోజు కావడంతో ఇవాళ 7 నామినేషన్లు వేశారు ఎంఐఎం కార్పొరేటర్లు. ఇప్పటివరకు టిఆర్ఎస్ నుంచి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. అవి కూడా పార్టీ నిర్ణయం మేరకు కాకుండా సొంతంగా వేసినట్లు సమాచారం అందుతోంది. పార్టీ నిర్ణయానుసారం ఇవాళ టీఆర్ఎస్ నుంచి 9 నామినేషన్లు వేయనున్నారు కార్పొరేటర్లు. 15 నామినేషన్లకు…