OTR : తెలంగాణలో మరో ఉద్యమానికి తెరలేపింది బీఆర్ఎస్. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో కీలకమైన సికింద్రాబాద్ కోసం ఆందోళనలకు సిద్దమవుతోంది. సికింద్రాబాద్ బచావో పేరుతో నిరసనలకు మొదలుపెడుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రగడ ప్రారంభమైంది. జంట నగరాలుగా పేరు ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ లలో సికింద్రాబాద్ పేరు లేకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సికింద్రాబాద్ ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని లష్కర్ సాధన సమితి పేరుతో రెండేళ్లుగా పోరాటం…