మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటిసారిగా స్పోర్ట్స్ డ్రామా “గని” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి వరుణ్ తేజ్ బాగానే కష్టపడుతున్నాడు. సినిమాలో తగిన మేకోవర్ కోసం జిమ్ లో కసరత్తులు చేసి కండలు పెంచేశాడు. అంతేకాదు బాక్సింగ్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్ల కోసం ఏకంగా విదేశీ స్టంట్ మాస్టర్స్ ను రంగంలోకి దించుతున్నారు.…