సింహాలను చూడాలని అందరికీ ఉంటుంది. జూకి వెళ్లి చూస్తాం. అయితే, అది ఎక్కడో దూరంగా ఉంటుంది. దానిని ఫొటోలు తీసుకొని సంతోషిస్తాం. దగ్గరగా చూడాలంటే సింహాల సంరక్షణా కేంద్రాలకు వెళ్లాల్సిందే. అక్కడ ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లి చూసిస్తారు. అయితే, ఎక్కువసేపు అక్కడ ఉండటం కుదరని పని. సింహాలకు ఆఫ్రికా ఖండం ప్రసిద్ధి. అక్కడ అనేక సింహాల సంరక్షణా కేంద్రాలు ఉన్నాయి. అందులో దక్షిణాఫ్రికాలోని జీజీ సింహాల సంరక్షణా కేంద్రం చాలా ప్రత్యేకమైనది. ఆ కేంద్రంలో భయంకరమైన సింహాలు…