టాలీవుడ్ లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స జరుగుతోంది. 86 ఏళ్ల కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా అప్పటి నుండి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్టు సమాచారం. Read Also : పవన్, ఎన్టీఆర్, మహేష్…
టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. నిన్న ఆయన ఆరోగ్యానికి సంబంధించి అపోలో ఆస్పత్రి నుంచి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అందులో కైకాల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అప్పటి నుంచి కైకాల అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా కైకాల త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కైకాల ఆరోగ్యానికి సంబంధించి ట్వీట్ చేశారు. అందులో…