Vivek Ramaswamy: అగ్రరాజ్యంలో స్థిరపడ్డ భారతీయ అమెరికన్లు.. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన వివేక్ రామస్వామి.. ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా ఆదర్శాలను తిరిగి పునరుద్ధరించేందుకు.. బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. ఇది రాజకీయ ప్రచారం మాత్రమే కాదని.. తర్వాతి తరం అమెరికన్లకు కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమమన్నారు. అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్న వివేక్ రామస్వామి.. అమెరికా అంటే ఏంటో…