Tejas MK1A: స్వదేశీ తయారీ యుద్ధ విమానం తేజస్ MK1A కోసం ఇంజిన్లను అందించే అమెరికన్ కంపెనీ జీఈ ఏరోస్పేస్ కంపెనీపై భారత్ భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. జనరల్ ఎలక్ట్రిక్(GE) ఏరోస్పేస్ తేజస్ కోసం F404-IN20 ఇంజిన్‌లను అందించడంలో విఫలమైంది. నిజానికి జీఈ 2023లోనే ఇంజిన్ల డెలివరీ ప్రారంభించాలి. చాలా సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా పర్యటనల సందర్భంగా ఆలస్యాన్ని లేవనెత్తినట్లు నివేదికలు తెలిపాయి.