POK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) హింసాత్మక ఆందోళనలు జరిగిన కొన్ని వారాల తర్వాత, మరోసారి నిరసనలు మొదలయ్యాయి. ఈసారి జెన్-Z నేతృత్వం నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థులు విద్యా సంస్కరణలపై, పెరుగుతున్న ఫీజులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నారు.
Nepal: నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి శుక్రవారం దేశ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. నేపాల్ సార్వభౌమాధికారంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. ఇటీవల, దేశంలో అవినీతికి వ్యతిరేకంగా జెన్-జీ యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనలు హింసకు దారి తీశాయి. భద్రతా బలగాలు జరిపిన దాడుల్లో 51 మంది మరణించారు.
నేపాల్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోమవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. దీంతో భద్రతా దళాలు-నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది నిరసనకారులు చనిపోయారు. ఇక కేపీ శర్మ ఓలి ప్రభుత్వం నిరసనలకు దిగొచ్చి... సోషల్ మీడియాపై విధించిన బ్యాన్‌ను ఎత్తేసింది.