కాంగ్రెస్ అంటే గతం. ప్రస్తుతం ఆగమాగం అంటూ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఎద్దేవ చేశారు. అమీర్ పేట్ 50 పడకల ఆసుపత్రిని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గీతారెడ్డి, జంగారెడ్డి కళ్లు ఉండి లేనట్లు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. వాళ్ల హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దావాఖానా అని పాడేవారు. ఇప్పుడు సర్కారు ఆసుపత్రికే పోతా అని అంటున్నారని ఎద్దేవ చేశారు. గీతారెడ్డి…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. తాజాగా ఈ వ్యవహారం మహిళా కమిషన్ వరకూ చేరింది. మహిళా కమిషన్ ని కలిసిన మాజీ మంత్రి గీతా రెడ్డి, రేణుకా చౌదరి రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి పీఠం పై కూర్చున్న మూర్ఖుడు అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ అన్నారు గీతారెడ్డి. రాహుల్ గాంధీ పై చేసిన కామెంట్స్ సభ్య సమాజం…