తెలంగాణ రాష్ట్రంలో సోమవారం (జూన్ 13న) పలు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు వేసవి సెలవులకు వీడ్కోలు పలికి, బోధనకు తెరతీశాయి. ఈ విద్యా సంవత్సరం పిల్లలకే కాదు, పంతుళ్ళకు కూడా పరీక్షనే! ఎందుకంటే ఈ యేడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేశారు. ఇది భాషాభిమానులకు బాధ కలిగిస్తున్న విష�