గోదావరిలో పైపులైను నుండి గ్యాస్ లీక్ కలకలం సృష్టించింది.. యానాం దరియాలతిప్ప కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య ప్రాంతంలో గోదావరిలో చమురు సంస్థలు వేసిన పైపులైను నుండి గ్యాస్ లీకవడంతో కలకలం రేగింది.. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప ప్రాంతం నుండి యానాం దరియాల తిప్ప మీదుగా గోదావరిలో వేసిన పైపులైను నుండి గ్యాస్ లీకు కావడంతో.. గోదావరిలో సుడులు తిరుగుతూ, బుడగలు వేస్తూ నీరు పైకి ఉబికి వచ్చింది.
తాగునీటి పైప్‌లైన్ పనులు చేస్తుండగా గ్యాస్పైపులైన్ పగిలిన ఘటన హైదరాబాద్నిజాంపేట్ ప్రధాన రహదారిలో చోటుచేసుకుంది. గ్యాస్ లీకేజీతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. అధికారులు అప్రమత్తమై.. లీకేజీని అరికట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నిజాంపేట్ ప్రధాన రహదారిలో గ్యాస్ లీకేజీతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. గాయత్రీ టవర్ సమీపంలో జేసీబీతో నీటి పైపులైను మరమ్మతు పనులు చేస్తుండగా.. పక్కనే ఉన్న గ్యాస్ పైప్ పగిలిపోయింది. అందులో నుంచి గ్యాస్ లీకవుతుండడంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్యాస్ లీకవ్వడంతో…