Cylinder Blast: హర్యానాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. సిలిండర్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనమయ్యారు. హర్యానాలో పానిపట్‌లో వంటగ్యాస్ సిలిండర్ లీకేజీ వల్ల ఇంట్లో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో దంపతులు, నలుగురు పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. పానిపట్ జిల్లా బిచ్‌పరి గ్రామ సమీపంలోని తహసీల్ క్యాంపు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు వ్యాపించడంతోల పక్కన ఉన్న ఇళ్లు కూడా దగ్ధమయ్యాయి.
Pakistan: ఎయిర్‌పోర్టులో యురేనియం.. దీనిపై పాకిస్తాన్ ఏమందంటే?
సిలిండర్ లీక్ కావడంతో ఇంటికి మంటలు అంటుకున్నాయని, నగరంలోని నివాస ప్రాంతంలో నివసించే ఈ కుటుంబం పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చిందని చెప్పారు. దంపతులు పానిపట్‌లోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రెస్క్యూ టీం గుర్తించే సమయానికి బాధితులు కాలిపోయారు. బాధితులను అబ్దుల్ (45), అతని 40 ఏళ్ల భార్య, 18, 16 ఏళ్ల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు, 12, 10 ఏళ్ల వయస్సు ఇద్దరు కుమారులుగా గుర్తించారు. మృతులను అబ్దుల్ కరీమ్(45), అఫ్రోజా(40), ఇష్రత్ ఖటుమ్(18), రేష్మా(16), అబ్దుల్ షకూర్(10), అఫాన్(7)గా పోలీసులు గుర్తించారు. అయితే ఉదయం వంట వండుతున్నప్పుటు గ్యాస్ లీకై ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు.