ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరం ఖానాపురం గ్రామాల్లో 89 వ రోజు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్రకు స్థానిక ప్రజలు వైఎస్సార్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పాదయాత్రలో గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి షర్మిల నివాళులర్పించారు. గ్రామంలోని ప్రజలు రైతుల కోరిక మేరకు షర్మిల తలపాగా చుట్టి రైతు అవతారంలో ట్రాక్టర్ నడిపి వైఎస్సార్ అభిమానులను రైతులను ఆనందపరిచారు. గన్నవరం నుంచి ఖానాపూర్ వరకు ట్రాక్టర్ నడిపారు.…