అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక భూపతిపాలెం ప్రాజెక్టులోకి తెల్లవారుజామున ప్రమాదవశాత్తు దూసుకు వెళ్ళిందో స్కార్పియో వాహనం. ఈవాహనంలో సుమారు 350 కేజీల గంజాయి తరలిస్తూ పోలీసులు వెంబడించడంతో నిందితులు పారిపోయే ప్రయత్నంలో ఈఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నం సరిహద్దుల నుంచి మారేడుమిల్లి మీదుగా అక్రమంగా తరలిస్తున్న గంజాయి వాహనాన్ని వెంబడించారు పోలీసులు. భూపతిపాలెం వద్ద జరిగిన ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొనగా, మరొక వ్యక్తి పరారయ్యాడు. ప్రాజెక్టు కాలువలోకి దూసుకెళ్లిన వాహనాన్ని…
రాష్ట్రంలో మహిళలు, విద్యార్ధినులపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న తీరుపై సీఎం జగన్ కి లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు.రాష్ట్రంలో గంజాయి, డ్రగ్, మద్యం అమ్మకాల వల్లే రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. దేశంలో ఏమూలన గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయి. దీని వల్ల రాష్ట్ర యువత భవిష్యత్ తో పాటు రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందని లేఖలో…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి మత్తు వేధిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే వుంది. విశాఖ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో గంజాయి సాగు, రవాణా అరికట్టే పనిలో నిమగ్నం అయ్యారు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నిర్మూలించే పనిలో బిజీ అయ్యారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ప్రభుత్వ శాఖల సమన్వయంతో…
గంజాయి గుప్పుమంటోంది. అక్రమార్కులు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. ప్రయివేట్ ట్రావెల్స్ బస్ లో గంజాయిని పట్టుకున్నారు శ్రీకాకుళం పోలీసులు. శ్రీకాకుళం జాతీయ రహదారిపై మూడు గంటల పాటు చీకట్లో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద ఆరంజ్ ట్రావెల్స్ సంస్థ చెందిన ప్రైవేటు ట్రావెల్స్ లో సుమారు 30 కిలోల గంజాయితో ఎస్.ఈ.బి పోలీసులు పట్టుకున్నారు. బస్సు 35 మంది ప్రయాణికులుతో భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళుతోంది. అటు…