పిచ్చి పలు రకాలు అని పెద్దలు అంటుంటారు. కొందరు వ్యక్తులు కూడా పిచ్చిగా ఏదేదో చేసేస్తుంటారు. హైదరాబాద్ నగరంలోని ఓ వ్యక్తి కూడా ఇలాగే పిచ్చి పని చేసి ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జవహర్‌నగర్ పీఎస్ పరిధిలోని యాప్రాల్‌కు చెందిన వెంకటనరసింహశాస్త్రి (53) బేకరీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తనకు రోజూ నిద్ర పట్టడం లేదని.. ఎన్ని మందులు వాడినా ఫలితం దక్కలేదని.. ఎవరో చెబితే గంజాయి తాగాడు. ఆరోజు నిద్ర మంచిగా…