ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ భాగస్వామి అయ్యాడంటే.. ప్రతీ గిరిజన యువకుడు ప్రభుత్వంలో వున్నట్టే లెక్క అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇక్కడ ప్రజల ఆవేదన, బాధ తెలుసుకోవడం కోసమే అటవీ ప్రాంతంలో పర్యటించామన్నారు. రూ.105 కోట్లతో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.
ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్, గంజాయి వ్యవహారంపై చేసిన విమర్శలు, ఆరోపణలు కాస్త శృతిమించి తీవ్ర వివాదానికి, కేసులకు దారి తీశాయి.. అయితే, మరోసారి డ్రగ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖ అర్బన్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి సాగును కట్టడి చేసేందుకు ఏపీ పోలీసులకు పూర్తి అధికారం, చేసే పరిస్థితులు ఇవ్వండి.. 48 గంటల్లో కట్టడి చేస్తారన్నారు. కానీ, ఈ ప్రభుత్వం వారికి అధికారాలు ఇవ్వదని ఆరోపించారు. ఇక, రోడ్ల…
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ పాలిటిక్స్ తీవ్రస్థాయిలో విమర్శలు, బూతుల వరకు వెళ్లాయి.. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ విషయాన్ని లేవనెత్తిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోసారి సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు.. 2018 నుంచి తాను గంజాయి స్మగ్లింగ్ విషయాన్ని హైలైట్ చేస్తూనే ఉన్నానని గుర్తుచేసిన ఆయన.. వైసీపీ హయాంలో గంజాయి స్మగ్లింగ్ మరింత పెరిగిందని ఆరోపించారు. ఇక, ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సమస్య ఇప్పుడు కొత్తగా…