పశ్చిమ బెంగాల్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి ఇంటికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్‌షా కలయిక కారణంగా గంగూలీ బీజేపీలో చేరతారా అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే తన ఇంటికి వచ్చిన అమిత్ షాకు గంగూలీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఆ తర్వాత బీజేపీ నేతల సమక్షంలోనే పలు అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ఆ తర్వాత గంగూలీ ఇంట్లోనే ఆయనతో కలిసి అమిత్ షా డిన్నర్…
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో జరగనున్న ఐపీఎల్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఐపీఎల్-2022 ఇండియాలో జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మరోసారి స్పష్టం చేశాడు. కరోనా పరిస్థితి చేయిదాటితే తప్ప ఈ సారి ఐపీఎల్‌ను ఇండియాలోనే నిర్వహిస్తామని తెలిపాడు. ముంబై, పూణెలలో లీగ్ మ్యాచ్‌లను జరుపుతామని… అహ్మదాబాద్ వేదిక గురించి ఇంకా ఆలోచించలేదని పేర్కొన్నాడు. Read Also: విండీస్‌తో సిరీస్‌కు ముందు షాక్.. టీమిండియా క్రికెటర్లకు కరోనా ఏప్రిల్, మే నెలల్లో ఇండియాలో కరోనా…
భారత క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వివాదం సద్దుమణుగుతోంది. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సెలక్షన్ కమిటీతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీపై వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అది మరవకముందే గంగూలీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. చివరకు ఈ వివాదం గంగూలీకి రోజులు దగ్గరపడ్డాయని క్రికెట్ అభిమానులు చర్చించుకునే స్థాయికి వెళ్లింది. అసలు విషయంలోకి వెళ్తే… బీసీసీఐ నిబంధనల ప్రకారం బీసీసీఐ అధ్యక్షుడు టీమ్ సెలక్షన్ కమిటీ సమావేశాలకు వెళ్లకూడదు. అయినప్పటికీ గంగూలీ…
భారత క్రికెట్‌లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. గత ఏడాది టీ20లు, వన్డేలకు సంబంధించి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. తాజాగా టెస్టులకు కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే ఇది అనూహ్య నిర్ణయం. కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. అయితే కోహ్లీ నిర్ణయంపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ‘ఇది పూర్తిగా విరాట్ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని బీసీసీఐ ఎంతో గౌరవిస్తుంది. విరాట్ సారథ్యంలో అన్ని ఫార్మాట్లలో భారత…
టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన తాజాగా కోలుకున్నారు. శుక్రవారం గంగూలీకి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది బయటిదాకా వచ్చి గంగూలీకి వీడ్కోలు పలికారు. నాలుగు రోజుల క్రితం కొంచెం అలసటగా ఉండటంతో గంగూలీ…
ఇప్పటికే ఆనారోగ్యంతో బాధపడుతున్న బీసీసీఐ చీఫ్ గంగూలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయనను కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు ఈ ఏడాది జనవరిలో గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పడు వైద్యులు గంగూలీ హార్ట్‌లో మూడు బ్లాక్స్‌ను గుర్తించి వెంటనే చికిత్స చేశారు. దీంతో గంగూలీకి ప్రాణాపాయం తప్పింది. అయితే ఇప్పుడు ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీమిండియాకు కెప్టెన్‌గా బాధ్యత వహించిన గంగూలీ..…
ప్రస్తుతం టీమిండియాలో విరాట్ కోహ్లీ-గంగూలీ ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారింది. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంపై విరాట్ కోహ్లీ అసంతృప్తిగా ఉన్నాడనే విషయం అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తనకు చెప్పకుండా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని.. టీ20 కెప్టెన్సీకి తాను రాజీనామా చేసినప్పుడు తనకు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకే కెప్టెన్ ఉండాలనే విషయం చెప్పలేదని కోహ్లీ చెప్పడంతో వివాదం చెలరేగింది. మరోవైపు విరాట్ కోహ్లీని టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని చెప్పినా వినలేదని గతంలో గంగూలీ చెప్పిన…
భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ కి కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ మధ్య బీసీసీఐ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుండి తప్పించిన తర్వాత గంగూలీ మాట్లాడుతూ… కోహ్లీ మొదట టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలోనే నేను తప్పుకోవద్దు అని చెప్పను. అయిన కోహ్లీ వినలేదు. దాంతో వైట్ బల్ ఫార్మాట్ లో ఇద్దరు కెప్టెన్ లు వద్దు అని విరాట్ ను వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ…
భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పనిభారం కారణంగా తాను టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు తాజాగా ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వైట్ బాల్ ఫార్మాట్ లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదు అని వన్డే కెప్టెన్సీ నుండి కూడా కోహ్లీని తొలగించి ఆ రెండు బాధ్యతలను భారత స్టార్ ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు అప్పగించింది. దాంతో బీసీసీఐ పై…
అంతర్జాతీయ వన్డేలకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను బీసీసీఐ నియమించడంతో కోహ్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. టీమిండియా విజయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తప్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్‌గా టీమిండియా మిగతా వాళ్ల సారథ్యంలో కంటే కోహ్లీ కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిందని పలువురు అభిమానులు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, జనరల్ సెక్రటరీ షా ఇద్దరూ కలిసి కుట్ర పన్నారంటూ కోహ్లీ…