Supreme Court: గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ శనివారం రాత్రి హత్యకు గురయ్యారు. పోలీస్ కస్టడీలో వైద్యపరీక్షల నిమిత్తం వచ్చిన ఇద్దరిని ముగ్గురు వ్యక్తులు జర్నలిస్టులుగా నటిస్తూ అతిదగ్గర నుంచి కాల్చి చంపారు. ఈ హత్య ఉత్తర్ ప్రదేశ్ తో పాటు యావత్ దేశంలో చర్చనీయాంశం అయింది. ప్రతిపక్షాలు సీఎం యోగి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. యూపీ ఎన్కౌంటర్ రాజ్ గా మారిందని సమాజ్ వాదీ…