ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర 2024 నవంబర్ నెలలో చివరికి చేరుకుంది. నవంబర్ 2న గంగోత్రి ధామ్ తలుపులు మూసేయగా.. నవంబర్ 3న కేదార్‌నాథ్ ధామ్ ఆలయాన్ని కూడా క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులు కూడా చట్ట ప్రకారం మూసివేశారు. మే 10న ప్రారంభమైన చార్‌ధామ్ యాత్రలో ఈ ఏడాది గంగోత్రి, యమునోత్రి ధామ్‌లకు వచ్చిన భక్తులలో ఇప్పటివరకు 53 మంది మరణించారు.
Uttarakhand Weather: కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్ తలుపులు తెరవడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఆచారాల ప్రకారం, కేదార్‌నాథ్ ధామ్ తలుపులు భక్తుల కోసం ఉదయం ఏడు గంటలకు దర్శనం కోసం తెరవబడ్డాయి.