తాజ్ మహల్ భద్రత మరోసారి విఫలమైంది. గంగాజలం అందించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సోమవారం తాజ్ కాంప్లెక్స్‌లో ఓ మహిళ గంగాజలాన్ని సమర్పించి.. శివుడి ఫోటోతో కూడిన జెండాను కూడా ఎగురవేసింది. వెంటనే ఈ విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న సీఐఎస్ఎఫ్ జవాన్లు మహిళను పట్టుకున్నారు. కాగా.. ఆ మహిళ జెండా ఎగురవేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Taj Mahal Ganga Water : ఆగ్రాలోని ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్‌లో హిందూ సంస్థకు చెందిన ఇద్దరు యువకులు గంగాజలాన్ని సమర్పించారు. హిందూ యువకులు వాటర్ బాటిళ్లలో గంగాజలం నింపి తాజ్ మహల్ లోపల గంగాజలాన్ని సమర్పించారు. తాజ్ మహల్ లోపలికి చేరుకున్న ఇద్దరు యువకులు ముందుగా సీసాలో నింపిన గంగాజలాన్ని చూపించి తాజ్ మహల్ లోపలికి వెళ్లి గంగాజలం అందించారు. వీరి వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అఖిల భారత…
GST on Ganga Jal: పోస్టాఫీసు నుంచి వచ్చే గంగాజలంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించింది. అంటే 250 ఎంఎల్ బాటిల్ రూ.30కి కొంటే.. ఇప్పుడు రూ.35 చెల్లించాల్సి వస్తోంది.
ఉత్తరప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీగా కురిసిన వర్షాలకు ఉన్నావ్‌లో వరదనీరు ముంచెత్తింది. అంతేకాకుండా.. డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయడంతో ఉన్నావ్ గ్రామం నీటిలో మునిగిపోయింది. మరోవైపు అక్కడి నివాసముండే ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనాలు. అంతేకాకుండా.. రోడ్లు, కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. అక్కడి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అత్యవసరంగా ప్రజలు ఎక్కడికైనా వెళ్లాలంటే పడవల సహాయంతో వెళ్తున్నారు.
పశ్చిమ బెంగాల్ లో రెండు వేర్వేరు చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. శివుడికి మొక్కుబడి ఉందని గంగాజలం కోసమని వెళ్లి ముగ్గురు యువకులు నదిలో మునిగిపోయారు. అసన్‌సోల్‌లో జరిగిన ఘటనలో ఒకరు గల్లంతు కాగా.. ముర్షిదాబాద్‌లోని బహరంపూర్‌లో జరిగిన ఘటనలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
ఢిల్లీలోని టిక్రీ ఖుర్ద్‌లో జరిగిన ఒక సంఘటన అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. 62 ఏళ్ళ సతీష్ భరద్వాజ్ చనిపోయినట్టు నిర్ధారించారు 11 మంది వైద్యులు. ఏం అద్బుతం జరిగిందో తెలీదు. చితికి నిప్పంటించే ముందు అతని నోటిలో గంగాజలం పోశాక కళ్లు తెరిచి మాట్లాడాడు. దీంతో అతడిని చితిపై నుంచి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు. కేన్సర్‌తో బాధపడుతున్న ఓ వృద్ధుడు మరణించాడు. విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు అంత్యక్రియలకు…