GHMC : రాబోయే గణేష్ ఉత్సవాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు లేకుండా, శాంతియుత వాతావరణంలో జరగాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల సహకారం అవసరమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో, ఈ నెల 27న ప్రారంభమై సెప్టెంబర్ 6వ తేదీ వరకు నిర్వహించనున్న గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కమిషనర్ అధ్యక్షతన…