Ganesh Immersion 2024: హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. నగరం నాలుగు మూలల నుంచి గణనాథులు ట్యాంక్ బండ్ పైకి తరలి వస్తున్నాయి. దీంతో ఈరోజు (సోమవారం) ఉదయం హుస్సేన్ సాగర్ చుట్టు పక్కల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా నదిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిలిపివేశారు.. దీంతో వరుసగా రెండో రోజూ కూడా గణేష్ నిమజ్జనాలు గోదావరిలో చేయడాన్ని నిలుపు వేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా నిమజ్జనానికి ఊరేగింపులతో గణేష్ విగ్రహాలు తీసుకుని వస్తున్న వాటిని పోలీసులు వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.