గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ. 19 వ తేదీన మధ్యాహ్నం 1.00 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి మంత్రులతో పాటు DGP మహేందర్ రెడ్డి, హైదరాబాద్ CP అంజనీ కుమార్ ఏరియల్ వ్యూ నిర్వహించనున్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జన ఏర్పాట్ల పై వివిధ శాఖల అధికారులతో ఈ రోజు మరోసారి సమీక్షించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. లక్షలాది…
హైదరాబాద్‌లో వినాయక శోభాయాత్రకు, నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది… బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే వినాయక శోభాయాత్ర.. ఓల్డ్‌సిటీ చార్మినార్ మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది.. ఇక, ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో గణనాథులు ట్యాంక్‌బండ్‌కు తరలివస్తారు.. ఈసారి వినాయక నిమజ్జనానికి భారీ బందోస్తు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం… వినాయక నిమజ్జానికి సిటీ పోలీస్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. హైదరాబాద్ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు…
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఇప్పటి వరకు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.. ఇక, ఈ నెల 19వ తేదీన నిర్వహించే గణేష్ శోభాయాత్ర, గణేష్ నిమర్జనానికి చకచకా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.. నిమజ్జన ఏర్పాట్లకు ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయాయని పేర్కొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసు, ట్రాపిక్ పోలీసు, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, ఆర్ అండ్ బీ, ఎలక్ట్రికల్ తదితర అన్ని…
ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.. అయితే, దీనికి కారణం మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే అని ఆరోపిస్తోంది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి.. వినాయక నిమజ్జనంపై సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు.. తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించి ఆర్డినెన్స్ తీసుకురావాలని.. జల్లికట్టు, శబరిమల మాదిరిగా తెలంగాణ సర్కారు ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు.. ఇక, రాష్ట్ర సర్కారు…