వినాయక చవితి వచ్చిందంటే యువకుల్లో సంబరాలు అంబరాన్నంటుతాయి. లంబోదరుని ప్రతిమలు పెట్టి నవరాత్రులు సంబురాలు చేయటం ఆనవాయితీ. వినాయక సంబురాలంటే యువతతో పాటు చిన్నారుల్లో తెలియని ఉత్సాహం, వీధివీధినా మండపాలు వేసి, పెద్దపెద్ద గణనాథుని విగ్రహాలు పెట్టి కోలాహలంగా వేడుక చేస్తారు. గణపతి పండుగలో సంబురాలకు ఎంత ప్రత్యేకత ఉంటుందో.. ప్రతిమలకు అంతే ప్రాధాన్యం ఉంటుంది. వినాయక విగ్రహాన్ని స్వయంగా తయారు చేయటమో.. లేదా తయారు చేసిన ప్రతిమనే కొనుక్కొచ్చుకొని ప్రతిష్ఠించి పూజలు చేయటమో లేదా.. పర్యావరణహితులెవరైనా…