Sukriti Veni: సుకుమార్ పై సంచలన కామెంట్స్ చేసిన కూతురు
- ‘గాంధీ తాత చెట్టు’ మూవీతో సుకుమార్ కూతురు సుకృతి వేణి తోలిపరిచయం
- ప్రమోషన్ లో భాగంగా తాజాగా ప్రెస్ మీట్
- తండ్రి పై సుకృతి వైరల్ కామెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి తొలిసారిగా ‘గాంధీ తాత చెట్టు’ సినిమాతో ఇండస్ట్రీలోని ఎంట్రీ ఇవ్వనుంది. జనవరి 24న విడుదల కానున్న ఈ మూవీకి పద్మావతి మల్లాది దర్శకత్వం వహించగా నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలుగా వ్యావహరించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్‌డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ప్రమోషన్ లో భాగంగా తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మూవీ టీం.
దీనికి సుకుమార్, అతని భార్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి సుకృతికి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. కానీ యాక్టింగ్ మీద ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించలేదు. నా ముందు అల్లరి చేస్తూ తిరిగే నా పాప ఎలా యాక్ట్ చేస్తుందో అనే చిన్న సందేహం ఉండేది. కానీ ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. దర్శకురాలు కథ ఎంత గొప్పగా రాసుకుందో అంతే గొప్పగా సినిమా తీసింది’ అంటూ తెలిపాడు. ఇక సుకృతి మీడియా సందర్భంగా మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ఇక సుకృతి మాట్లాడుతూ.. ‘ మా నాన్నని సినీ పరిశ్రమలోని పెద్ద దర్శకుల్లో ఒకడిగా చూడాలని నా కళ అది నెరవేరింది.‘పుష్ప’ మూవీ ఆయనకు ఎంతో గుర్తింపు సంపాదించి పెట్టింది. అయితే ఈ మూవీలో నాకు ఓ పాత్ర ఇవ్వమని నేను మా నాన్న ని అడిగాను. ముందు ఆడిషన్ ఇవ్వు తర్వాత చూద్దాం అని అన్నారు. వర్క్ విషయంలో ఆయనకు అందరూ సమానం. నాకు చిన్నప్పటి నుండి సినిమాలో నటించాలి అని ఏం అనుకోలేదు. కానీ మంచి కథతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే, అవకాశాలు కూడా వస్తాయి అని నా నమ్మకం. ‘గాంధీ తాత చెట్టు’ సినిమా కూడా మంచి కథ అందుకే ఒప్పుకున్నా. మీకు కచ్చితంగా నచ్చుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!