Violence : గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీటుపీజీ క్యాంపస్‌లో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగరీత్యా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు దేవరాజు ఒకటో తరగతి చదువుతోన్న బాలుడు లవన్ సాయి కుమార్‌పై శారీరక దాడికి పాల్పడ్డాడు. విద్యార్థి తరగతిలో అల్లరి చేశాడనే కారణంతో ఉపాధ్యాయుడు అతని వీపుపై బలంగా కొట్టినట్టు సమాచారం. ఇంటికి చేరిన బాలుడి పైన గాయాలను గమనించిన తల్లి, వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాల వద్దకు చేరుకున్నారు. అయితే…
Gambhiraopet: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పారిశుద్ధ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం రోడ్డెక్కారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీ కార్మికులు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాల చెల్లింపుల కోసం బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి – సిద్దిపేట ప్రధాన రహదారిపై సుమారు గంటపాటు కార్మికులు ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ.. నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబాల పోషణ భారంగా మారిందని వాపోయారు.…
KG to PG First Campus: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మానస పుత్రిక అయిన 'కేజీ టు పీజీ' కాన్సెప్ట్ త్వరలో అమల్లోకి రానుంది. పేద పిల్లలకు కిండర్ గార్టెన్ (కేజీ) నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) వరకు ఉచిత విద్య అందించాలన్న సీఎం కేసీఆర్ స్వప్నం సాకారం కాబోతోంది.