జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులపై ఆర్మీ చేపట్టిన 'ఆపరేషన్ సుజలిగల'లో హీరోగా నిలిచిన కెంట్ అనే జాగిలానికి మరణానంతరం రాష్ట్రపతి శౌర్య పురస్కారం ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్ 11న ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ జాగిలం ప్రాణాలు కోల్పోయింది.
వింగ్ కమాండర్ దీపికా మిశ్రాకు భారత వైమానిక దళం (IAF) చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి గురువారం వాయు సేన పతకాన్ని అందించారు. ఆమె శౌర్య పురస్కారం అందుకున్న మొదటి మహిళా ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా నిలిచారు.