దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’ తన కొత్త టాబ్లెట్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఏ సిరీస్‌లో భాగంగా ‘శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్’ (Samsung Galaxy Tab A11+)ను లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ 11-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది Wi-Fi, 5G మద్దతుతో వచ్చింది. ఈ టాబ్లెట్ ప్రారంభ ధర రూ.22,999గా ఉంది. 7040mAh బ్యాటరీ, బెస్ట్ ఫీచర్స్ ఉన్న గెలాక్సీ ట్యాబ్ ఏ11 ప్లస్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం.…