Gaddar : ధరణి పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు ప్రజా యుద్ధనౌక గద్దర్. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద అలైన్‌మెంట్ మార్చాలని ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.
ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Gaddar: ప్రజా సమస్యలపై మరోసారి పోరాటానికి సిద్ధం అవుతున్నారు ప్రజా యుద్ధనౌక గద్దర్.. ఇవాళ శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరుబాట పడతానని ప్రకటించారు.. చిక్కోలు (శ్రీకాకుళం)లో నిర్మించిన ఉద్యమ మార్గం లక్ష్యాన్ని చేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, దివంగత ప్రజాగాయకుడు వంగపండుతో కలిసి ఒకే పాటను 32 భాషల్లో పాడి లక్షలాది మందిని ఉద్యమం వైపు కదిలించామని గుర్తుచేసుకున్నారు.. మరోవైపు.. భారత రాజ్యాంగం ఒక పుస్తకం…
Ukku Satyagraham:విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కిన 'ఉక్కు సత్యాగ్రహం' ఆడియోను గద్దర్ చేతులమీదుగా విడుదల చేశారు. 'ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి, రంగుల కళ, కుర్రకారు, అయ్యప్ప దీక్ష, గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా' వంటి చిత్రాలను నిర్మించిన సత్యారెడ్డి ఈ సినిమాను రూపొందించారు.
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో 26 రోజుల వ్యవధి మాత్రమే వుంది. ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలు ఎన్నికల కార్యాచరణలో వేగాన్ని పెంచాయి. 12మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యేలకు అధికార టీఆర్‌ఎస్ బాధ్యతలు అప్పగించగా నిన్న శనివారం ఒక్కరోజే ఐదుగురు మంత్రులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నంత పని చేశాడు.. మునుగోడు ఉప ఎన్నిక బరిలో తమ పార్టీని అభ్యర్థిని పోటీకి పెట్టబోతున్నారు.. మునుగోడు ఉపఎన్నిలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రజా యుద్ధనౌకగా పేరు గాంచిన ప్రజాగాయకుడు గద్దర్ పేరును ప్రకటించారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గద్దర్.. రేపటి నుంచి మునుగోడులో ఇంటింటికెళ్లి ప్రచారం చేస్తానని ప్రకటించారు.. ఇక, ఆమరణ దీక్ష విరమించారు పాల్… గద్దర్ తనతో నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. అక్టోబర్…
ప్రజా గాయకుడు గద్దర్ అంటే తెలియనివారుండరు.. ఆయనో కరుడుగట్టిన కమ్యూనిస్టు అనిది నిన్నటి మాట.. ఇప్పుడా ఎర్రమందారం కాస్తా.. కలర్ మారబోతుందా? అనే చర్చ సాగుతోంది.. ఆయన ఈ మధ్య తరచూ వివిధ పార్టీల నేతలను కలవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న రాజకీయ విశ్లేషకులు.. ఈ కామ్రేడ్.. ఏ పార్టీ కండువైనా కప్పుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. దీనికి కారణం లేకపోలేదు.. ఈ మధ్య వరుసగా కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నేతలను కూడా కలుస్తూ వచ్చారు…