Gaddar: ప్రజా సమస్యలపై మరోసారి పోరాటానికి సిద్ధం అవుతున్నారు ప్రజా యుద్ధనౌక గద్దర్.. ఇవాళ శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరుబాట పడతానని ప్రకటించారు.. చిక్కోలు (శ్రీకాకుళం)లో నిర్మించిన ఉద్యమ మార్గం లక్ష్యాన్ని చేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, దివంగత ప్రజాగాయకుడు వంగపండుతో కలిసి ఒకే పాటను 32 భాషల్లో పాడి లక్షలాది మందిని ఉద్యమం వైపు కదిలించామని గుర్తుచేసుకున్నారు.. మరోవైపు.. భారత రాజ్యాంగం ఒక పుస్తకం కాదు.. వెయ్యి తరాల యుద్ధాల గ్రంథంగా అభివర్ణించారు గద్దర్.. ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లో శ్రీకాకుళం పోరాటాలు మా చెవిలో పడటంతో ఉద్యమాల బాట పట్టానని తెలిపారు.. ఇక, కిడ్నీ రోగులకు అండగా పాదయాత్ర చేస్తానని వెల్లడించారు గద్దర్.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్