రష్యాకు సహాయం చేసినందుకు గాను భారత టెక్నాలజీ కంపెనీతో సహా పలు దేశాలకు చెందిన 10 కంపెనీలపై జపాన్ నిషేధం విధించింది. పాశ్చాత్య దేశాలు, వారి మిత్రదేశాలు ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై కఠినమైన వాణిజ్య, ఆర్థిక ఆంక్షలు విధించాయి.
PM Modi: హిరోషిమాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ వెళ్లారు. శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడమే కాకుండా, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో సహా అనేక మంది ప్రపంచ నాయకులతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలిడిమిర్ జెలన్ స్కీతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య సమావేశానికి సంబంధించి ఇరు దేశాల దౌత్యవేత్తల మాట్లాడుతున్నట్లు సమాచారం.