ఈమధ్య కాలంలో మనం పెళ్లిళ్లలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవడాన్ని తరచూ చూస్తూనే ఉన్నాం. వాటిల్లో కొన్ని సీరియస్‌గా ఉంటే, మరికొన్ని నవ్వులు తెప్పించే విధంగా ఫన్నీగా ఉంటున్నాయి. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఒకటి రెండో కేటగిరీకి చెందింది. ఒక్క మిఠాయి, కేవలం ఒకే ఒక్క మిఠాయి వధూవరుల మధ్య చిచ్చు పెట్టేసింది. దీంతో, అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వేదికపై ఉన్న వధూవరులు.. ఒకరినొకరు పొల్లు పొల్లుమని కొట్టేసుకున్నారు.…