స్నేహితులే కాలయములుగా మారి భార్యను అసభ్యకరంగా దూషించడనే నేపంతో స్నేహితుడిని హత్య చేశాడు . రైల్వే స్టేషన్ లో సమోసాలు అమ్ముకునే ఇద్దరు స్నేహితుల మధ్య మద్యం మత్తులో వివాదం ఏర్పడింది. ఈ వివాదంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. తన భార్యను అసభ్యకరంగా మాట్లాడటంతో ఈ హత్యకు దారితీసింది. రాఖీ పండుగ రోజున జరిగిన ఈ హత్య సంచలనంగా మారింది..
నర్సుగా నటించి ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి భార్యనే హతమార్చాలని ప్రయత్నించింది ఓ మహిళ. ఇంజెక్షన్ వేసి ఆమెను చంపాలని వ్యూహం పన్నింది. కానీ అది బెడిసికొట్టి పోలీసులకు చిక్కింది.