Damodara Rajanarasimha : ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన పౌరులతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా ఉంది. అనారోగ్యం వల్ల ప్రజలు అప్పులపాలు కాకుండా, అవసరమైన అన్ని వైద్య సేవలు వారికి సమయానికి అందాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. వైద్యం ఉచితంగా లభిస్తుందన్న భరోసా ప్రజలకు కలగాలి. ఆ భరోసాను కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద…