Gruha Jyothi Scheme: ఆరు హామీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రెండు హామీలు అమలు చేశారు. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు.
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు దేశ మధ్యంతర బడ్జెట్-2024ను సమర్పించారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను మొదట వివరించారు. మాకు మహిళలు, పేదలు, యువకులు, రైతులు ఇలా నాలుగు కులాలు ఉన్నాయని, వారిపైనే దృష్టి సారించామన్నారు.
లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భారతదేశంలోని కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సిస్టమ్‌ను బిగించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ పై సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కరెంట్ పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. లేదంటే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్ లో ఇటు కామారెడ్డిలో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటాను అని ఆయన తెలిపారు.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 224 సీట్లకు గానూ 135 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది.
కర్ణాటకలో విజయం అనంతరం దేశంలో తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దేశంలో బీజేపీని గద్దె దించేందుకు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ ఎన్నికలకు ఇప్పటి నుంచి హామీల వర్షం కురిపించి ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.
వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తన ముద్రవేయాలని అప్ పార్టీ చూస్తున్నది. ఇందులో భాగంగా పంజాబ్‌లో ఆప్ విజయం సాధించి అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించింది. చంఢీగ్ పర్యటనకు ఒకరోజు ముందుగా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో పంజాప్ ఆప్ కేడర్ మరింత ఉత్సాహంగా మారింది. పంజాబ్ లో అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు వినియోగించేవారికి ఉచితంగా విద్యత్…