కరోనా మహమ్మారి మరోసారి అగ్రరాజ్యం అమెరికాపై దండయాత్ర చేస్తోంది.. ఒమిక్రాన్ విజృంభణతో యూఎస్ విలవిల్లాడుతోంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో యూఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే కోవిడ్-19 పరీక్షలు చేసుకునేలా 100 కోట్ల ర్యాపిడ్ కిట్లతో పాటు వైరస్ బారినపడకుండా రక్షణ కల్పించే ఎన్95 మాస్క్‌లను తమ పౌరులకు ఉచితంగా అందిస్తామని దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దీంతోపాటు వచ్చే వారం నుంచి వెయ్యి మంది సైనిక వైద్య సిబ్బందిని దేశవ్యాప్తంగా మోహరిస్తామని…