కరోనా మహమ్మారి మరోసారి అగ్రరాజ్యం అమెరికాపై దండయాత్ర చేస్తోంది.. ఒమిక్రాన్ విజృంభణతో యూఎస్ విలవిల్లాడుతోంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో యూఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే కోవిడ్-19 పరీక్షలు చేసుకునేలా 100 కోట్ల ర్యాపిడ్ కిట్లతో పాటు వైరస్ బారినపడకుండా రక్షణ కల్పించే ఎన్95 మాస్క్‌లను తమ పౌరులకు ఉచితంగా అందిస్తామని దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దీంతోపాటు వచ్చే వారం నుంచి వెయ్యి మంది సైనిక వైద్య సిబ్బందిని దేశవ్యాప్తంగా మోహరిస్తామని తెలిపారు. వైద్య సౌకర్యాలను పెంచటం, సిబ్బంది కొరతను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉద్ధృతిని కట్టడి చేసేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read Also: కోవిడ్, ఒమిక్రాన్‌పై నిపుణుల హెచ్చరిక
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలోనే.. చాలా మంది వైద్య సిబ్బంది వైరస్‌బారినపడి హోమ్క్వారంటైన్కు వెళ్తున్నారు. దీంతో పెద్ద పెద్ద ఆసుపత్రులు సైతం సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. వైరస్‌కు గురైన సిబ్బంది సైతం పలు ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ కొరతను తగ్గించేందుకు ఫెడరల్మెడికల్సిబ్బందిని ప్రభుత్వం… పలు రాష్ట్రాలకు పంపించింది. అదనంగా మిలటరీ వైద్యులను అవసరమైన ప్రాంతాలకు పంపనున్నారు. కాగా, అమెరికాలో 24 గంటల్లో కొత్తగా 8 లక్షల మందికి పైగా పాజిటివ్‌గా తేలింది. 1,969 మంది వైరస్‌తో మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8.69 లక్షలు దాటింది. కేసుల సంఖ్య 6.23 కోట్లను అధిగమించింది.