ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది.. కడప జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశారు కామాంధుడు. చిన్నారిని అత్యాచారం చేసి.. హత్య చేసి.. ఆ తర్వాత కంపచెట్లలో పడేసి వెళ్లిపోయారు దుండగుడు. శుక్రవారం నాడు నాలుగేళ్ల చిన్నారిని రేప్ చేసి.. చంపి ముళ్లపొదల్లో వేసిన దారుణ ఘటన మైలవరంలోని కంబాలదిన్నె గ్రామంలో చోటు చేసుకుంది.