నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈదురుగాలుల బీభత్సానికి తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న కోళ్ల ఫారం ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో గోడ మీద పడటంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరి కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. రెండు గంటలుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులు, పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.