Lions Attack Cow:గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని 11 తాలూకాల్లో సింహాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తరుచుగా వేట కోసం తరచూ వచ్చి వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో, తాజాగా నాలుగు సింహాలు రాత్రి వేట కోసం జిల్లాలోని రాజులాలోని పిపావావ్ పోర్ట్ ప్రాంతానికి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాత్రి వేటలో వెతుకులాటకు బయలుదేరిన సింహాలు ఎద్దును వేటాడేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో చూడవచ్చు. ఇంతలో ఎద్దు సింహాలను ఎదుర్కొంది. అంతేకాదు…