హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉస్మానియా యూనివర్శిటీలో ఆకతాయిల అరాచకాలు రాజ్యమేలుతున్నాయి. అక్కడ విద్యార్థులు ఉంటారు.. చదువుకుంటారు అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. పైగా అలాంటి వారిని ప్రశ్నిస్తే.. అచ్చోసిన ఆంబోతుల్లా మీద పడి క్యాంపస్ విద్యార్థుల పైనే దాడి చేస్తున్నారు. అలాంటి ఓ ఘటనలో పోలీసులు నలుగురు అకతాయిలను అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ.. విద్యార్థులపాలిట దేవాలయం. అక్కడ చదువుకోవాలని.. ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో సీట్ కోసం ఎంతో మంది విద్యార్థులు తపస్సు చేస్తుంటారు.…
Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్‌లోని పలు పబ్‌లలో ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లబ్ రఫ్ పబ్, ఫ్రూట్ హౌస్ లో పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పబ్‌లోని యువత మత్తులో జోగుతున్నారు.
ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. హత్య చేసిన కీలక నిందితులు శ్రీనివాస్, ప్రవీణ్ గా తేల్చారు. వారితో పాటు శవం పూడ్చేందుకు సహకరించిన జేసీబీ యజమాని నరేష్, డ్రైవర్ సోహన్ ను కూడా అరెస్ట్ చేశారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం సంగీతం గ్రామంలో నాటు తుపాకుల కలకలం రేపాయి. సంతోష్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలకు వెళ్లారు.