రాష్ట్రంలో రక్షణ కరువయిందని కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కిడ్నాప్ లు, హత్యలు మామూలు అయిపోయాయని, ల్యాండ్ డీల్స్ కు తెలంగాణ కేంద్రంగా మారిందని ఆమె ఆరోపించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ధరణి పోర్టల్ సృష్టించిన ఇబ్బందుల వల్ల రైతులు నష్టపోతున్నారని ఆమె అన్నారు. వేల మంది రైతులు నా దగ్గరకు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటుంన్నారని, ఎప్పుడో అమ్మిన భూముల యాజమాన్య హక్కులు మారడం లేదని…