Visas to Pak: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ జాతీయులకు వీసాలను కూడా రద్దు చేస్తు్న్నట్లు బుధవారం భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27 నుంచి పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 29 వరకు మాత్రమే వైద్య వీసాలకు అనుమతించింది.
ఇదిలా ఉంటే, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేయడంపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ‘‘జలయుద్ధం’’గా పేర్కొంది. ఈ చర్యలను చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంది. భారత తీరును చట్టబద్ధంగా సవాల్ చేస్తామని, ప్రపంచ బ్యాంక్ వంటి ప్రపంచ సంస్థ మధ్యవర్తిత్వంతో జరిగిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా నిష్క్రమించలేదని పాకిస్తాన్ తెలిపింది.
Abir Gulaal: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులు చనిపోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ అయిన లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. మంగళవారం, పహల్గామ్‌లోని బైసరీన్ పచ్చిన మైదానాలు చూస్తున్న టూరిస్టులపై ముష్కరులు దాడి చేశారు.
Danish Kaneria: పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా ఆగ్రహం సొంత దేశంపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పాకిస్తాన్ తరుపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అతికొద్ది మంది హిందూ ఆటగాళ్లలో కనేరియా ఒకరు. మంగళవారం జరిగిన ఉగ్ర ఘటనపై ఆయన మరోసారి స్పందించారు.
ఈ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాక్ తరుపున ఆడిన అతికొద్ది మంది హిందూ క్రికెటర్లలో ఒకరైన దానిష్ కనేరియా స్పందించారు. ‘‘పహల్గామ్ దాడిని క్రూరమైన దాడి’’గా ఖండించారు. ‘‘బంగ్లాదేశ్ నుంచి బెంగాల్, కాశ్మీర్ వరకు అదే మనస్తత్వం హిందువుల్ని లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ ఈ లౌకికవాదులు, న్యాయవ్యవస్థ దాడి చేసిన వారిని అణిచివేయబడిన మైనారిటీగా ముద్రవేస్తోంది’’ అని ట్వీట్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. తన పోస్టులో భర్తను కోల్పోయిన మహిళ,…