మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై ప్రతిపక్షాలు ‘కక్ష సాధింపు చర్యే’నంటూ చేస్తోన్న విమర్శలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. విద్యార్థులకు సహజమైన విద్యనందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు.. రికార్డుల వేటలో అక్రమాలకు పాల్పడ్డాయని అన్నారు. అసలు పేపర్ మాల్ ప్రాక్టీస్ కల్చర్ నారాయణ, శ్రీచైతన్య సంస్థల నుంచే వచ్చాయన్నారు. అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే నారాయణ దొరికిపోయారని చెప్పిన సజ్జల.. రికార్డుల కోసం వాళ్ళు తప్పుడు విధానాలకు పాల్పడ్డారన్నారు. కాపీయింగ్‌ను ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా నారాయణ…