జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేఎంఎం మాజీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ బీజేపీ గూటికి చేరారు. రాజధాని రాంచీలో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ సమక్షంలో చంపై సోరెన్ బీజేపీలో చేరారు.
జార్ఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్.. గాండే అసెంబ్లీ ఉప ఎన్నికకు జేఎంఎం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ జార్ఖండ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు (Former Jharkhand CM Hemant Soren) మరోసారి ఈడీ (ED) కస్టడీ కోర్టు పొడిగించింది. ఇప్పటికే రెండు సార్లు ఈడీ కస్టడీకి ఇచ్చింది.